top of page
Shiva YT

రోగనిరోధక శక్తి పెంచుకోవాలా..? 🍶🤲

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, శీతాకాలంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను కలుపుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

పాలలో తేనె కలపడం వల్ల తీపి రుచి పెరగడే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా అందిస్తాయి. తేనె కలిపిన పాలలో ప్రోటీన్, జింక్, విటమిన్ డి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పాలు తేనె కలిపిన పాలు తాగడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలోని కాల్షియం, విటమిన్ డి బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది.

ఒక గ్లాసు పాలలో తేనె కలిపి తాగితే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఈ పానీయంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చలికాలంలో జీర్ణకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పాలల్లో తేనె కలుపుకుని తాగాలి. పాలల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి తేనెలోని సూక్ష్మజీవులతో కలిసి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్-గుండె మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 🥛🍯🍏

bottom of page