top of page
Shiva YT

🌾 ఇన్ స్టెంట్ రాగి పిండి దోశతో హెల్త్ కి హెల్త్.. 🍽️

ఇన్ స్టెంట్ రాగి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి, బియ్యం పిండి, రవ్వ, ఉప్పు, పెరుగు, జీల కర్ర, మిరియాల పొడి, కరివేపాకు, నూనె, క్యారెట్ తురుము, కొత్తి మీర, పచ్చి మిర్చి.

ఇన్ స్టెంట్ రాగి దోశ తయారీ విధానం:

ముందుగా ఒక మిక్సీ జార్ తీసు కోవాలి. ఇందులోకి రాగి పిండి, బియ్యం పిండి, రవ్వ, రాగి పిండి, ఉప్పు, పెరుగు, తగినన్ని నీళ్లు పోసుకుని.. దోశ పిండిలా మిక్సీ పట్టు కోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్ట్స్ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పక్కకు వేసుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత పిండి తీసుకుని.. ఇందులో జీల కర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి.. హీట్ అయ్యాక పిండితో దోశ వేసుకోవాలి. ఈ దోశపై క్యారెట్ తురుము, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తి మీర చల్లు కోవాలి. తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకుని బాగా కాల్చు కోవాలి. ఆ తర్వాత దోశను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని.. చట్నీతో కలిపి తినడమే. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ సిద్ధం. సమయం లేనప్పుడు ఇలా రాగి దోశలను చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. 🥗💪🍲

bottom of page