ఒత్తిడితో నిజంగానే జుట్టు రాలుతోందా.? నిపుణులు ఏమంటున్నారు..
- Shiva YT
- Jan 19, 2024
- 1 min read
ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో అధిక మొత్తంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. 😊
ఈ హార్మోన్ చర్మం, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే జుట్టు తెలుపుకు రంగులోకి మారడమే కాకుండా, జుట్టు రాలడం కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి జుట్టు రాలడానికి మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల పరిశోధన ప్రకారం.. ఒత్తిడి వల్ల జుట్టుపై మూడు రకాలుగా నష్టం కలిగిస్తుంది. టెలోజెన్ ఎఫ్ఫ్లూవియం, ట్రైకోటిల్లోమానియా మరియు అలోపేసియా ఏరియాటా అనే మూడు రకాల ప్రభావం చూపుతుంది. టెలోజెన్ ఎఫ్ఫ్లూవియం వల్ల ఒత్తిడి కారణంగా ఆకస్మాత్తుగా జుట్టు రాలిపోతుంది. హెయిర్ గ్రోత్ సైకిల్‌పై ప్రభావం పడి, జుట్టు రాలిపోతుంది. ఈ స్థితిలో హెయిర్ ఫోలికల్స్ చాలా యాక్టివ్‌గా మారుతాయి. 😊