top of page
Shiva YT

🍉 ఫ్రూట్స్ తో వెయిట్ లాస్ అవ్వండి.. ఎలా అంటే!! 🍏

రోజూ సరైన మోతాదులో ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 🚫 అందులోనూ ప్రస్తుతం అధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు పండ్లను తమ డైట్ లో చేర్చుకుని ఈజీగా బరువు తగ్గొచ్చు.


🧀 పెరుగు, చీజ్ తో పండ్లు:

మీరు బరువు తగ్గాలనుకుంటే.. ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. 🧀 కాటేజ్ చీజ్ పండ్లు, గ్రీక్ పెరుగు, నట్స్ వంటి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. 🍽️ పెరుగు, నట్స్ వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. అలాగే కెలరీస్ కూడా ఎక్కువగా అందుతాయి. కాబట్టి వేరేవి తినాలన్న కోరిక ఉండదు. 🥦

🚫 ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు:

పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. 🍽️ ఖాళీ కడుపుతో పండ్లు తింటే.. బ్లడ్ లో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ప్రోటీన్, తృణ ధాన్యాలు, పండ్లు కలిపి తీసుకుంటే బెటర్. 🍚

🍎 ఎక్కువగా తినకూడదు:

ఫ్రూట్సే కదా ఏమీ కాదని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పండ్లలోనే కెలరీస్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన మోతాదులో తినాలి. 🍓

🥗 కేవలం ఫ్రూట్స్ మీదనే ఆధారపడకూడదు:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఫ్రూట్స్ తింటున్నాం కదా అని బ్రేక్ ఫాస్ట్, లంచ్ పై ఆసక్తి చూపించరు. 🚫 కానీ ఇది చాలా తప్పు. ఇలా చేస్తే బరువు తగ్గడం సంగతి పక్కన పెడితే.. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. 🤕 కొన్ని రకాల పండ్లను మీ భోజనం, మరికొన్ని స్మూతీలలో, సలాడ్స్, నట్స్ ఇలా కలుపుతూ తీసుకుంటూ ఉండాలి. 🥦🍲

bottom of page