అమ్మాయిల ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవడానికి 25 ఏళ్ల తర్వాత ఏయే ఆహారం తీసుకోవాలో పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. 😇
ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు 🌾 కార్బోహైడ్రేట్లు శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్త్రీలలో కండరాల కంటే కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగానే వారు బరువు త్వరగా పెరుగుతారు. శారీరక శ్రమ చేసేవారిలో కొవ్వు వేగంగా పెరగదు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి కాంప్లెక్స్ పిండి పదార్థాలు తీసుకోవాలి. కాంప్లెక్స్ పిండి పదార్ధాలు తృణధాన్యాలు, వోట్స్, హోల్ వీట్ పాస్తాలో సమృద్ధిగా ఉంటాయి. 🍞
ఆరోగ్యకరమైన కొవ్వులు 🥦 శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అవసరం. అసంతృప్త కొవ్వు ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. సాల్మన్ ఫిష్, బాదం, వాల్‌నట్స్, ఇతర నట్స్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్‌లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది మనసు సంతోషంగా ఉండేలా చేస్తుంది. దీనితో పాటు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకల నొప్పిని నివారిస్తుంది. 🥜
ప్రొటీన్ 🍗 శరీరంలోని కండరాలను పెంచేందుకు ప్రోటీన్లు చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా జుట్టు, గోళ్ల పెరుగుదలలో ప్రోటీన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆడపిల్లలు ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. మాంసకృత్తులు తినడం వల్ల ఎముకల పటుత్వం పెరగడంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది. గుడ్లు, చీజ్, చికెన్, కాయధాన్యాలు, సోయా ముక్కలు మొదలైనవాటిల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. 🍖
ఐరన్ 🌿 సాధారణంగా అమ్మాయిలలో పీరియడ్స్ కారణంగా ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వారు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. బీట్‌రూట్, ఉసిరి, పాలకూర, దానిమ్మ వంటి వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 🥗