top of page
Suresh D

చలి కాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం మంచిదేనా..?🚶‍♂️❄️

ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఉదయం కుదరని వారు సాయంత్రం అయినా నడవడం మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే చలి కాలంలో ఉదయం వాకింగ్ చేయడం మంచిదేనా? అని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకవేళ మంచిదే అయితే ఎంత సేపు నడవాలి? అని అనుకుంటూ ఉంటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.❄️🧤

విపరీతమైన చలిలో వాకింగ్ చేయడం ప్రమాదకరం..❄️🧤

కాలం ఏదైనా సరే ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ మరీ విపరీతమైన చలిలో వాకింగ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చలి కాలంలో ఉదయం పూట నడవడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. ఒక వేళ చేయాలి అనుకునే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

వీటిని పాటించాలి..❄️🧤

* చలి కాలంలో వాకింగ్ కి వెళ్లే ముందు సరిగ్గా డ్రెస్ వేసుకోవాలి. మరీ టైట్ వి కాకుండా.. కాస్త వదులుగా ఉండే వాటిని ధరించడం మేలు. ఎక్కువగా బరువు ఉండే దుస్తులు ధరించకూడదు. అదే విధంగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. 

* తలకు, చెవుల్లో గాలి చేరకుండా, కాళ్లు, చేతులను కూడా కప్పుకోవాలి. చలిలో నడిచేటప్పుడు మొదట వేగంగా నడవాలి. దీంతో బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా నడిస్తే.. ఆ హీట్ సరిపోతుంది.

* గుండె సమస్యలు, ఆస్తమా, న్యుమోనియా వంటి సమస్యలు ఉంటే ఉదయం వాకింగ్ చేయకపోవడమే బెటర్. సాయంత్రం సమయం అది కూడా 6 గంటలలోపే చేయాలి.

* ఉదయం సూర్య రశ్మి భూమికి తాకేటప్పుడు నడిస్తే చాలా మంచిది. ఈ సీజన్ లో కాస్త తక్కువగా నడిచినా ఎలాంటి హాని ఉండదు. ఇంట్లోనే పలు రకాల వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుంది.

* శీతా కాలంలో నడవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. బద్ధకం వదిలి.. యాక్టీవ్ గా ఉంటారు. దీంతో వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇన్ ఫెక్షన్లు కూడా దరి చేరకుండా ఉంటాయి.🌬️🌅

bottom of page