ఇటీవల శ్యామల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భగా మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. సినిమాల్లో నటించాలాని నేను మా అమ్మ ఇద్దరం ఇక్కడకి వచ్చాము. అయితే ముందుగా సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. అయితే షూటింగ్ లో నన్ను కొంతమంది విసిగించే వారు. నాతో మాట్లాడటానికి ప్రయత్నించే వారు. అలాగే లవ్ ప్రపోజ్ చేసి ఇబ్బందిపెట్టారు. అవన్నీ తట్టుకోలేక పోయాను.
సీరియల్స్ మానేసి వెళ్ళిపోదాం అనుకున్నా.. అదే సమయంలో ఓ క్యామెరామెన్ నన్ను బాగా వేధించాడు. రోజూ రాత్రుళ్లు ఫోన్లు చేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడేవాడు, బెదిరించే వాడు. మా ఆమెకు ఫోన్ చేసి మీకు మగదిక్కు లేదు. నేను మిమ్మల్ని చూసుకుంటా.. మీ కూతురికి చెప్పండి.. తనకు అర్ధం కావడం లేదు. మీకోసం ఏదైనా చేస్తా అని చెప్పాడు. దాంతో అతను నాకు ఏదైనా హాని చేస్తాడేమో అని మా అమ్మ భయపడిపోయింది. తిరిగి వెళ్ళిపోదామని చెప్పింది. కానీ నాకు ఏం కాదు అంటూ ధైర్య చెప్పను అని తెలిపింది శ్యామల. ఇప్పుడు ఏ చిన్నది యాంకర్ గానే కాకుండా సినిమాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకుంటుంది. 😊