top of page
Shiva YT

బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినవచ్చా.. 🍲

డయాబెటీస్ పెరిగే అవకాశం:

అయితే ఉదయం అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి. దీని వల్ల మధు మేహం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా మీరు ఎంచుకునే బియ్యాన్ని బట్టి కూడా ఉంటాయి. అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం అన్నం తినాలి అనుకుంటే మితంగా తీసుకుంటే చాలా మంచిది. 🍚

వెయిట్ పెరుగుతారు:

అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు కూడా బ్రేక్ ఫాస్ట్ గా అన్నాన్ని తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. దీనికి కారణం అన్నంతో కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే అన్నం తినే వారి కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే బియ్యం తక్కువ కొవ్వ, చక్కెర, సోడియం ఉన్న ఆహారం. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు తక్కువ మోతాదులో అన్నం తీసుకోవచ్చు. 🥗

జీర్ణ క్రియకు మేలు:

ఉదయం అల్పాహారంగా అన్నం తినడం వల్ల జీర్ణ క్రియకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా సులభంగా జీర్ణం అవుతుంది. అదే విధంగా అతిసారం వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి హెల్ప్ చేస్తుంది. 🥦

మితంగా తీసుకుంటే బెస్ట్:

ఎలాంటి సందేహాలు లేకుండా అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. మరి ఎక్కువ మోతాదులో కాకుండా.. మితంగా తీసుకుంటే చాలా మంచిది. ఉదయం పూట యాక్టీవ్ గా ఉంటారు కాబట్టి.. శక్తి ఎక్కువగా కావాలి. ఉదయం అన్నం తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. ఉదయం, మధ్యాహ్నం అన్నం తినే వారు.. రాత్రి భోజనం చేయడం మానుకోండి. 🍽️


bottom of page