నేటి బిజీ లైఫ్‌లో ప్రతి 10 మందిలో ఏడుగురు మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్య.. మలబద్దకం అనేది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.. దీనివల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, చిరాకు, మానసిక ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది.
మలబద్ధకం సమస్య ఏ వయసు వారినైనా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ప్రజలు ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే, ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. తక్కువ శారీరక శ్రమ చేయడం, ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం లేదా మద్యం, ధూమపానం వంటి తప్పుడు జీవనశైలి అలవాట్లను అనుసరిస్తే, చిన్న వయస్సులో కూడా మీరు తరచుగా మలబద్ధకంతో బాధపడే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.. కొన్ని చిట్కాలను అనుసరిస్తే మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.. మలబద్ధకం నుంచి బయటపడటానికి 5 దివ్యౌషధ పరిష్కారాలను మీకు ఈ కథనంలో చెప్పబోతున్నాం.. తద్వారా మీరు మీ పొట్టను శుభ్రం చేయడానికి ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవలసిన అవసరం ఉండదు.. అవేంటో తెలుసుకోండి..
అల్లం: హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, అల్లం మలబద్ధకం సమస్యలో సహాయపడుతుంది. ఇది దిగువ ప్రేగులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది తిమ్మిరి, ఉబ్బరం, వికారం వంటి తరచుగా మలబద్ధకంతో పాటు వచ్చే ఇతర లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఉదయం ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్కను నమలి తినవచ్చు లేదా వేడి నీటిలో కలుపుకుని త్రాగవచ్చు..
వేడి నీరు – నిమ్మ: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగాలి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా మలబద్ధకం సమస్య నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
త్రిఫల: త్రిఫల అనేది మూడు ఔషధ మొక్కల మిశ్రమం.. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం.. ఇది మలబద్ధకం సమస్యలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఉదయం పొట్ట తేలికగా క్లియర్ అవుతుంది.
అవిసె గింజలు : అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట సమస్యలను నివారిస్తుంది. మలం సులభంగా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగులో లేదా వేడి నీటిలో కలిపి కూడా అవిసె గింజలను తినవచ్చు.🩺