అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప 2’. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.🎥🎞️
‘పుష్ప 2’ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సినీ అభిమానులలో మరింత ఆసక్తి కలిగిస్తోంది. పుష్ప రాజ్ ఎడమ చేతి మూడు వేళ్లకు బంగారు ఉంగరాలు ఉండటంతో పాటు చిటికెన వేలుకి పింక్ నెయిల్ పాలిష్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించడం ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. ఆయన చిటికెన వేలుకి గోర్ల పెయింట్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది. సంస్కృతి ప్రాముఖ్యతను కలిగిన పురుషులు తమ చేతి చిటికెన వేలికి నెయిల్ పాలిష్ చేసుకుంటారట. అంతేకాదు, పొడవాటి గోరుకు పింక్ పెయింట్ వేసుకోవడం సంపద, ఉన్నత సామాజిక స్థితికి సూచనగా భావిస్తారట. మాన్యువల్ లేబర్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తిగా అతడిని పరిగణిస్తారట. తాజాగా ఈ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో, దర్శకుడు సుకుమార్ సునిశితదృష్టిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన 'పుష్ప 2'లో ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ సరికొత్తగా కనిపించారు. గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా ఉంటారో, అలా కనిపించారు. మొత్తంగా పోస్టర్లతోనే సినిమాపై ఓరేంజిలో ఆసక్తి కలిగిస్తున్నారు దర్శకుడు. 🎥🎞️