top of page
Suresh D

గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్.. 😊


ఎంత కాస్ట్లీ ఫోన్ మనం వాడుతున్నా వాటిలో ప్రధానమైన సమస్య అందరికీ కామన్ గా ఉంటుంది. అదే స్టోరేజ్. ఎంత జీబీ ఉన్న ఫోన్ అయినప్పటికీ ఇటీవల వచ్చిన హై రిజల్యూషన్ కెమెరాల కారణంగా ఎక్కువ స్టోరేజ్ ను ఆక్రమిస్తున్నారు. వాటి ద్వారా తీసే ఫొటోలు, వీడియోలు అధికంగా ఫోన్ స్టోరేజ్ ను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ గూగుల్ యాప్ దీనికి ఓ పరిష్కారాన్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫొటోస్ యాప్ మనందరికీ పరిచయమే. ఈ యాప్ ఓ కొత్త ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది చాలా మంది వినియోగదారుల దీర్ఘకాలిక సమస్య అయిన స్టోరేజ్ సమస్యను పరిష్కరిస్తుందని పలు ఆన్ లైన్ నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఫీచర్ ఏంటంటే స్టోరేజ్ సేవర్. ఇది మీ ఫోటోలు, వీడియోల నాణ్యతను తగ్గించి.. మీ స్టోరేజ్ వినియోగాన్ని తగ్గించి, మీకు అదనపు స్టోరేజ్ ను ఇస్తుంది. యాప్ వినియోగదారులు ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలు లేదా వీడియోలను కుదించే విధంగా ‘స్టోరేజ్ సేవర్’ ఉపయోగపడుతుంది. అయితే ఇది గూగుల్ ఫోటోలకు జోడించబడుతున్న ఫైల్‌ల కోసం మాత్రమే పనిచేస్తుంది . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. గూగుల్ ఫోటోలకు జోడించి ఉన్ ఫైళ్లను కంప్రెస్ చేసి మనకు అదనపు స్టోరేజ్ ను అందిస్తుంది. 📷


bottom of page