top of page
MediaFx

రోజూ 350 మందికి ఉచితంగా భోజనాలు పంపిస్తున్న హీరో సందీప్ కిషన్


నెలకు రూ. 4లక్షల విలువైన ఆహారం ఫ్రీగా..

వివాహ భోజనంబు రెస్టారెంట్ కు మొత్తం ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజూ ఉచితంగా 50 మందికి భోజనాలు పంపిస్తున్నాడట. అవసరం ఉన్న పేదలు, కూలీలు, అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు డైలీ ఒక్కో రెస్టారెంట్ నుంచి 50 మందికి ఫుడ్ పంపిస్తున్నాడట. అంటే రోజూ సుమారు 350 మంది పేదల కడుపు నింపుతున్నాడన్నమాట. అలాగే దాదాపు నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఉచితంగా పంచి పెడుతున్నట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ‘ ఒక హీరోగా ప్రజలకు నేనేమి చేయగలను అని ఆలోచించినప్పుడు రెస్టారెంట్స్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాను. అలాగే ఎంతో మంది కడుపు నింపుతున్నాను’ అని చెప్పుకొచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. అన్న క్యాంటీన్ల తరహాలోనే సబ్సిడీ క్యాంటీన్లు..

కాగా అన్న క్యాంటీన్ల తరహాలోనే త్వరలోనే సబ్సిడీ క్యాంటిన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాట సందీప్ కిషన్. ప్రస్తుతం దాని గురించి వర్క్​ చేస్తున్నట్టు చెప్పాడీ యంగ్ హీరో. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, అభిమానులు, ప్రజలు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



bottom of page