ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే, ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయీ.. ఇంతకీ మీరు చెబుతున్నది దేని గురించీ... అని అంటారా? లేడీస్ స్పెషల్ గురించి! అదేనండీ.
ఓ వైపు నటీమణులుగా కొనసాగుతూ, ఇంకో వైపు నిర్మాణ సంస్థలను పెట్టి సినిమాలు నిర్మిస్తున్న వారి గురించి.. నార్త్ టు సౌత్ ఈ కౌంట్ కాస్త మెండుగానే కనిపిస్తోందండోయ్..
స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఛార్మి. పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె ఈ మధ్య వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత లైగర్ తీశారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా ఛార్మీ ఖాతాలోదే.
మంచు లక్ష్మీ, జెనీలియా, తాప్సీ కూడా ఆల్రెడీ నిర్మాతలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తాను నటించినా, నటించకపోయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆలియాభట్.
డిజిటల్ కంటెంట్ అందించడంలో ముందున్నారు నిర్మాత నీహారిక కొణిదెల. ఇటు సమంత రీసెంట్‌గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. నటి నజ్రియా నజీమ్, జ్యోతికకు ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్‌ల బాధ్యతలున్నాయి. నయనతార ఆల్రెడీ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లేడీస్‌గా పేరు తెచ్చుకున్న కంగన రనౌత్‌కి ఓన్ బ్యానర్ ఉంది. అమలాపాల్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఇటు అవికా గోర్, నిత్యామీనన్, కృతి సనన్ కూడా ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. రెండు పడవల మీద ప్రయాణం కష్టమే. కానీ, ప్యాషన్‌తో పనిచేస్తే అలుపూ సొలుపూ ఉండదని అంటున్నారు ఈ నాయికలు.