top of page
Suresh D

వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక


టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య మౌనికా రెడ్డి రెండు రోజుల క్రితం ఏప్రిల్ 13న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి, మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే పాపకు ఎమ్ ఎమ్‌ పులి అని ముద్దు పేరు పెట్టినట్లు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. ఇక మౌనిక ప్రసవ సమయంలో మంచు లక్ష్మీ అన్నీ దగ్గరుండి చూసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోనే ఉంటూ ప్రతిక్షణం మౌనికకు ధైర్యం చెబుతూ తోడుగా ఉంది. ప్రసవం అనంతరం మనోజ్, మౌనిక, లక్ష్మితో పాటు ఆస్పత్రి వైద్యులు దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇక మంచు మనోజ్, మౌనికల ప్రేమ వివాహం గతేడాది మార్చిలో జరిగింది. ఈ పెళ్లి తన నివాసంలో దగ్గరుండి మరీ చేయించింది మంచు లక్ష్మి. ఇప్పుడు కూడా మౌనిక డెలివరీ సమయంలో దగ్గరుండి మరీ అన్నీ తానై చూసుకుంది.

bottom of page