మాస్ మహారాజ రవితేజ చివరిసారిగా ఈగిల్ చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు.
రవితేజ తదుపరి మిస్టర్ బచ్చన్ మూవీ లో కనిపించనున్నారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం తరువాత రవితేజ చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే రవితేజ చేయబోయే సినిమాల్లో మరొక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. గతేడాది సామజవరగమన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కి భాను బోగవరపు కథ అందించారు. అయితే ఇతన్ని దర్శకుడు గా పరిచయం చేయనున్నట్లు టాక్. దీనిపై క్లారిటీ రావాలంటే, కొంత కాలం వేచి చూడాల్సిందే.🎥✨