నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ అత్యాచర సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓచోటల నిత్యం చిన్నారులు, మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.. తాజాగా.. హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. బస్సులో ఓ డ్రైవర్ మహిళపై .. రెస్టారెంట్ లో చిన్ననాటి స్నేహితురాలిపై ఇద్దరు వ్యక్తుల లైంగిక దాడి మరువకముందే.. మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ సాప్ట్ వేర్ యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వైజాగ్ కు చెందిన సిద్దార్థ్ వర్మ(30) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.. ఈ క్రమంలో.. హైదరాబాద్ పుప్పలగూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్న అనంతపురం ప్రాంతానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు.. తెలిసిన యువతి ద్వారా సాప్ట్ వేర్ యువతిని పరిచయం చేసుకున్న సిద్దార్థ్ వర్మ.. ఆమె నంబర్ తీసుకున్నాడు.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆ యువతిని నమ్మించాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ వర్మ యువతిని ఓ రోజు డిన్నర్ పేరిట తాను ఉంటున్న ఇంటికి పిలిచాడు.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఇలా యువతిపై సిద్దార్థ్ వర్మ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఆ యువతి.. సిద్దార్థ్ వర్మ పై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు సిద్దార్థ్ వర్మ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.