top of page
MediaFx

హే లవ్ లీ నువ్వా..!! ఇంతలా మారిపోయావ్ ఎంటమ్మడూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. పవన్ తన నటన, యాటిట్యూడ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులకు పండగే..

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఎవరు గ్రీన్ సినిమాలు కొన్నున్నాయి.. వాటిలో తమ్ముడు సినిమా ఒకటి. తమ్ముడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమాతో పవన్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 1999లో విడుదలైన ఈ సినిమాకు అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రీతీ ఝాంగియాని నటించింది. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది.

తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్  డబ్బున్నవాడు అనుకోని ప్రేమించిన లవ్ లీ గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉందో తెలుసా.? ఆమె పేరు అదితి గోవత్రికర్. తమ్ముడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఈమె కోసం పాడిన హే పిల్ల నీ పేరు లవ్ లీ అనే సాంగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.

అయితే ఈ అమ్మడు చిన్న వయసులోనే మోడలింగ్ రంగం లో అడుగు పెట్టింది. ఆతర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది విన్నర్ గా నిలిచింది. తమ్ముడు సినిమా తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. దావూదీ బోహ్రా ముస్లిం మెడికల్ స్కూల్ సీనియర్ అయిన ముఫజల్ లక్డావాలాను వివాహం చేసుకుంది అదితి గోవత్రికర్. ఆతర్వాత భర్తతో విడిపోయింది. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


bottom of page