నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' (Hi Nanna) సినిమా డిసెంబర్ 7న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.
నేచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' (Hi Nanna) సినిమా డిసెంబర్ 7న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌కి మంచి ఫీల్ ఇస్తుందని ఇప్పటికే నాని తన ప్రమోషన్స్‌లో చెప్పుకొస్తున్నాడు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కి కళ్లుచెదిరే ధర పలికిందని టాక్. ఆ వివరాలేెంటో చూద్దాం.
హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ (అన్ని భాషలతో కలిపి) రూ.37 కోట్లు పలికాయి. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఈ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అలానే హిందీ డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకి మరో 7.5 కోట్లు కూడా దక్కాయి. దీన్ని బట్టి రిలీజ్‌కి ముందే నిర్మాతకి భారీ ఊరట కలిగినట్లే.
దసరా సినిమాతో తన కెరీర్‌లోనే తొలిసారి రూ.100 క్లబ్‌లో చేరాడు నాని. ఆ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై గట్టిగానే అంచానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇతర భాషల్లో కూడా నానికి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.🎥💰