గ్లోబల్ వైడ్ గా మంచి పేరున్న హానర్ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది.
హానర్ 90 5జీ పేరిట వస్తున్న ఈస్మార్ట్ ఫోన్ విశేషం ఏమిటంటే దీనిలో ఏకంగా 200ఎంపీ కెమెరా ఉంటుంది. 2023, సెప్టెంబర్ అంటే ఈ నెల 14న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. హానర్ కంపెనీ ఈ ఫోన్ లోని డిస్ ప్లే, కెమెరా, డిజైన్ లలో కొత్తదనాన్ని జోడించింది. కెమెరా క్వాలిటీ.. హానర్ 90 5జీ ఫోన్ ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. దీనిలోని కెమెరా సెటప్. ఇది 200ఎంపీ ప్రధాన కెమెరా తో కూడిని ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది అత్యాద్భుతమైన కెమెరా క్వాలిటీని అందిస్తుంది. ఫొటో గ్రాఫిక్స్ బెస్ట్ ఆప్షన్. 4కే వీడియో రికార్డింగ్ ఉంటుంది. 10 రెట్ల డిజిటల్ జూమింగ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ వీడియో షూటింగ్ దీనితో సాధ్యమవుతుంది. 📷📹
బ్యాటరీ సామర్థ్యం.. హానర్ 90 ఫోన్లో 4,900ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది ఫోన్ ఎక్కువ సేపు పనిచేసేందుకు సాయపడుతుంది. 66 వాట్ల సామర్థ్యతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండే అవకాశం ఉంది. 🕒🔋💽