జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బంధుత్వాలు బలపడతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆప్తుల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మంచిది కాదు. ఖర్చులు అధికమగును. అప్పులు చేయాల్సి వస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పాత మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథునరాశి
మిథునరాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని తపఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కొన్ని సమస్యలు తొలగుతాయి. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు విపరీతంగా చేస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు సాగవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రశంసలు అందుకుంటారు. సాయం ఆశించవద్దు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మీ నమ్మకం ఫలిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియచేయండి. ఆలోచనల్లో మార్చు వస్తుంది. పొదుపు ధనాన్ని ముందుగానే గ్రహిస్తారు. కళ్యాణ వేదికలు అన్వేషిస్తారు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశికి ఈ రోజు మీకు మధ్యస్త ఫలితాలు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం పనికిరాదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పత్రాలు అందుకుంటారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు మీకు ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలసిరావు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. పట్టుదలతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంప్రదింపులు, సమావేశాల్లో పాల్గొంటారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలేర్చడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడులు కలసిరావు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమార్చు అనివార్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.