జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు చేసే పనులకు గౌరవం పొందుతారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు ఈరోజు అప్పులు చేయాల్సి రావొచ్చు. అయితే అప్పులను సులభంగా పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు తాము తీసుకునే నిర్ణయం వల్ల సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లలను ఏదైనా కోర్సులో చేర్పించేందుకు తొందరపడాల్సి రావొచ్చు. ఈరోజు కొన్ని వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులు దాని నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. మిధున రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు ఏ పని అయినా ఆలోచించి చేయాలి. మీ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మీ కుటుంబ అవసరాలు పెరగడం వల్ల ఖర్చులు పెరగొచ్చు. ఈ కారణంగా మీ ఆదాయాన్ని పెంచుకోవడం గురించి ఆలోచిస్తారు. మీరు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలలో గడుపుతారు. మీ పిల్లల వైపు నుంచి కొన్ని సానుకూల వార్తలను కూడా వింటారు.
కర్కాటక రాశి వారి ఫలితాలు
ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు ఇష్టమైన పనులన్నీ చేస్తారు. మీ తల్లిదండ్రుల నుంచి ప్రేమ లభిస్తుంది. మరోవైపు వారి ఆరోగ్యంలో క్షీణత ఉండొచ్చు. మీ విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు.
సింహ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ కుటుంబంలో ఏవైనా విభేదాలుంటే, మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాలి. మీ కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది ఈరోజు మెరుగుపడుతుంది.
కన్య రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు ఏ పని అయినా నిర్భయంగా, ధైర్యంగా చేస్తారు. అందులో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ విద్యలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు గురువుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాయంత్రం మీరు బంధువుల ఇంటికి వెళ్లొచ్చు.
తుల రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు సేవ చేస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలను సాధిస్తారు. సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు కొన్ని కొత్త అవకాశాలను పొందొచ్చు. దీంతో మీ పురోగతికి అవకాశం లభిస్తుంది. మీ పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ సోదరుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. వృశ్చిక రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల వల్ల ఇబ్బంది పడతారు. మరోవైపు వ్యాపారం విస్తరించాలనుకునే వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ నాన్నగారితో ఏదైనా గొడవ జరిగితే అందులో మౌనంగా ఉండటం మంచిది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీ పనిని పాడు చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు.
ధనస్సు రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. అయితే సాయంత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు సాయంత్రం కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మకర రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఆశించిన లాభాలు రాకపోవడంతో కొంత నిరాశ చెందుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుతుంటే దాన్నుంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీని వల్ల మీకు కొంత ఖర్చవుతుంది.
కుంభ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించొచ్చు. దీంతో కొంత గందరగోళంగా ఉంటారు. మీ బంధువులను విశ్వసించే ముందు బాగా ఆలోచించాలి. ఎందుకంటే వారు కూడా మీకు ద్రోహం చేస్తారు. పరిమిత ఆదాయం కారణంగా కొంత ఆందోళన చెందుతారు. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త వనరులను పొందుతారు. ఈరోజు ఒక యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తారు. మీన రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు సామాజిక గౌరవం పొందుతారు. మీ సంతోషకరమైన వ్యక్తిత్వం కారణంగా, మరికొందరు మీతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ కుటుంబంతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.