జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆచితూచి అడుగేయాలి. రాబడిపై దృష్టిపెడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆస్తి వివాదాలు కష్టమవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ నమ్మకం వమ్ము కాదు. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించిండి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగ్గదు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. బంధుత్వాలు బలపడతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన ధనం అందుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల ధనసహాయం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ కృషి ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. అందరిలో కలసిమెలసి వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ సమయం. ఆర్థిక స్థితి ఆశాజనకం. ధనలాభం ఉంది. ఊహించని ఖర్చులే ఉంటాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. తులా రాశి తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అపజయాలకు కృంగిపోవద్దు. ఆత్మస్థైర్యంతో ప్రయత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వేడుకకు హాజరవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధిస్తారు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవాలి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. ధనూ రాశి ధనూ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలసిరావు. అయినవారితో సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. మకర రాశి మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అవకాశాలు కలసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆదాయం బాగుంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలగిస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ చొరవతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది. కుంభ రాశి కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనుల్లో జాప్యం అధికం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. పిల్లల దూకుడు అదుపు చేయండి. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. మీ ఆలోచనలు నీరు గార్చేందుకు యత్నిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధ కుదిరే సూచనలున్నాయి. గృహలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.