top of page
Suresh D

🔮🌟ఈరోజు వృషభం, మిధునంతో సహా ఈ రాశులకు శని దేవుని అనుగ్రహం లభించనుంది...!🔍 🔮

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కాబట్టి మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించాలి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మరోవైపు మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా శుభ కార్యక్రమం గురించి మీ కుటుంబంలో చర్చలు జరుగుతాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపార స్థానాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, దాని వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కొంత కాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చిన్న పిల్లలు కూడా మీ నుండి కొన్ని అభ్యర్థనలు చేయవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేయొచ్చు.

మిధున రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు కొన్ని కొత్త వ్యాపార ప్రణాళికలను రూపొందించుకుంటారు. మీ భాగస్వామితో ఆలోచనలను పంచుకుని ముందడుగు వేస్తారు. ఈరోజు పని చేసే వ్యక్తులకు వారు ఎక్కువగా ఇష్టపడే పని అప్పగించబడుతుంది. దీంతో మీ ఉత్సాహం మరింత పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు తమ సీనియర్లతో కలిసి విద్యలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం పొందుతారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులను పరిష్కరించడానికి మీ సోదరుడితో చర్చించొచ్చు. ఈరోజు ఉద్యోగులు తమ పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు రాత్రి ఏదైనా శుభకార్యానికి హాజరు కావొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఇతరులతో పంచుకునే ఆలోచనలు స్వాగతించబడతాయి.

సింహ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు సమస్యల్లో ఉన్న వ్యక్తులకు మీరు కొంతమేరకు సాయం చేస్తారు. అయితే ప్రజలు దీనిని మీ స్వార్థంగా భావించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారులు ఇచ్చే అదనపు భారం వల్ల పనుల్లో కొంత ఆటంకాలు కలగొచ్చు. ఈ కారణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం పెరుగుతుంది. మీ పనులను చాలా జాగ్రత్తగా చేయాలి. మీ ప్రవర్తనలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీ చుట్టూ ఏదైనా వివాదం తలెత్తితే, అందుకు దూరంగా ఉండాలి. లేకుంటే అది చట్టబద్ధం కావొచ్చు. ఈరోజు మీరు ఏ పని చేసినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు.

తులా రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్టు చేయాలని ఆలోచిస్తుంటే అది కచ్చితంగా పూర్తవుతుంది. ఆస్తికి సంబంధించిన మీ కుటుంబ విషయాలు ఏవైనా కోర్టులో పెండింగులో ఉంటే, అందులో మీరు విజయం సాధించొచ్చు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పని ప్రవర్తనకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే అది కూడా ఈరోజు పరిష్కరించబడుతుంది.

వృశ్చిక రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు లాభదాయకమైన అవకాశాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి పార్టీని నిర్వహించొచ్చు. మీ సోదరి వివాహానికి ఏదైనా ఆటంకం కలిగితే, ఈరోజు కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కారం కనుగొంటారు. కుటుంబంలో ఏదైనా కలహాలు ఏర్పడితే, అది ఈరోజు ముగుస్తుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన లావాదేవీలు చేసే ముందు తండ్రి సలహాలు తీసుకోవాలి. లేదంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఉపాధికి సంబంధించి కొన్ని కొత్త అవకాశాలొస్తాయి. అయితే మీరు వాటిని గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు వాటిని సద్వినియోగం చేసుకోగలరు. ఈరోజు మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా జబ్బు ఉంటే వారి బాధలు ఈరోజు పెరగొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో ఉద్యోగులు తాము చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ తండ్రితో సంబంధాలను మెరుగుపరచుకోవాలి.

కుంభ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే, అది కూడా ఈరోజుతో ముగుస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో కలిసి తీర్థయాత్రకు విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.

మీన రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు ఇంటికి అతిథి రావొచ్చు. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు రిస్క్ తీసుకోవాల్సి వస్తే, దాని ఫలితాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీరు మధురమైన ప్రవర్తనతో మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని చేస్తే అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలొస్తాయి. ఈరోజు సోదరులతో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.

bottom of page