top of page

🔮🌟కార్తీక సోమవారం వేళ ధనస్సు, మకర రాశులకు ఉత్తమ ఫలితాలు..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...🔍

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు

మేష రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీకు రావాల్సిన బకాయిలు, రుణాలను సులభంగా పొందుతారు. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి మంచి గౌరవం లభిస్తుంది. ఈ సాయంత్రం మీరు స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

వృషభ రాశి వారి ఫలితాలు

వృషభ రాశి ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడంలో కచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే తొందరపాటులో ఏ పనీ చేయకూడదు. మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు. మీకు కుటుంబ సభ్యులతో వాగ్వాదం కలిగి ఉంటే, మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించాలి

మిధున రాశి వారి ఫలితాలు

మిధున రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ డబ్బుతో మీకు పూర్తి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీకు ఏదైనా శారీరక సమస్య ఉంటే, ఈరోజు మీ నొప్పి పెరుగుతుంది. ఈ కారణంగా మీ మనస్సు కూడా కలత చెందుతుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు వారి కష్టానికి తగ్గట్టుగా పని లభిస్తుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు

సింహ రాశి వారి ఫలితాలు న్ని ప్రారంభిస్తే సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి గౌరవం కూడా లభిస్తుంది. మీరు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారికి ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ఈరోజు మీరు మీ విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు, కానీ మీ ఆదాయాన్ని చూసిన తర్వాత మాత్రమే మీరు దీన్ని చేయవలసి ఉంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు

సింహ రాశి వారు ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయకపోవడం వల్ల కొంచెం నిరాశ చెందుతారు. అయితే ఇందులో మీరు ఏ తప్పు వ్యక్తిని నమ్మి లావాదేవీలు చేయకూడదు. లేకపోతే భవిష్యత్తులో అది విచ్ఛిన్నమవుతుంది. ఈరోజు మీరు మీ స్నేహితుల్లో ఎవరినైనా ఆర్థిక సహాయం కోసం అడిగితే, మీరు సులభంగా పొందుతారు. మీకు కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అది మరింత పెరగొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు

కన్య రాశి వారు ఈరోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా రంగాల్లో మీరు శుభ ఫలితాలను పొందుతారు. మీ భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రజలకు సహాయం చేస్తుంటే, స్వార్థంగా పరిగణించకూడదు.

తులా రాశి వారి ఫలితాలు

తులా రాశి వారు ఈరోజు కుటుంబంలోని కొన్ని శుభకార్యాల గురించి చర్చించొచ్చు. మీరు ఈరోజు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే, చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. ఈరోజు మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు. ఈరోజు మీరు మీ పిల్లల నుండి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను కూడా వినొచ్చు. మీకు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదం చాలా కాలంగా ఉంటే, ఈరోజు మీరు విజయం పొందొచ్చు.

వృశ్చిక రాశి వారి ఫలితాలు

వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు కుటుంబంలో ఏదైనా వాదనలు జరుగుతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాయంత్రం నాటికి కుటుంబంలోని సీనియర్ సభ్యులు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. మరోవైపు మీరు చేసే పనులను మీ ప్రత్యర్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు

మకర రాశి వారి ఫలితాలు ్యవహరించాలి. వ్యాపారులు కొన్ని కొత్త ప్లాన్లు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటేనే, దాని నుంచి మీకు పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారులు తక్కువ లాభం ఉన్నప్పటికీ సంతృప్తిగా కనిపిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా బలహీనంగా ఉంటాయి.

మకర రాశి వారి ఫలితాలు

మకర రాశి వారు ఈరోజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విలువైన వస్తువులను పొందొచ్చు. ఈరోజు మీ పిల్లల చదువు కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు భవిష్యత్తులో ఎక్కడికైనా చేరుకోగలరు. ఈరోజు మీ అత్తమామల నుండి గౌరవం పొందుతున్నట్లు అనిపిస్తుంది. ఉద్యోగులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. కుంభ రాశి వారి ఫలితాలు

కుంభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం క్షీణించొచ్చు. కాబట్టి ఈరోజు మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ బంధువులలో ఒకరు మీకు ద్రోహం చేయొచ్చు. మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా దానిని నివారించగలరు. ఈరోజు మీరు ప్రాపంచిక సుఖాల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.

మీన రాశి వారి ఫలితాలు

మీన రాశి వారు ఈరోజు తమ పిల్లల పెళ్లి విషయంలో పెండింగులో ఉన్న పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. సామాజిక గౌరవం పొందడంతో ఈరోజు మీ మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీ సంతోషకరమైన జీవితం కారణంగా, ఇతర వ్యక్తులు మీతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది.

 
 
bottom of page