top of page

ఇళ్లంతా బుగ్గిపాలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

MediaFx

ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమాకు చెందినదిగా తెలిసింది. ఓక్లహోమా అగ్నిమాపక విభాగం ద్వారా ఈ వీడియో షేర్ చేయబడింది. వీడియోలో కొన్ని కుక్కలు ఆ ఇంటికి నిప్పంటించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. అవన్నీ ఆడుకుంటున్నాయి. కానీ, ఉన్నట్టుండి ఒక కుక్క నోటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ కుక్కలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. సంఘటన జరిగినప్పుడు, ఇంట్లో రెండు కుక్కలు, ఒక పిల్లి ఉన్నాయి. ఇంటి యజమాని ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా తెలిసింది. అయితే, ఆ కుక్క నోటిలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉందని తెలిసింది. దానిని ఆ కుక్క నమలుతుండగా ప్రమాదం జరిగింది. బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాలా సేపటి నుండి ఆ కుక్క బ్యాటరీని నములుతూ ఉండగా, ఒక్కసారిగా స్పార్క్ బయటకు వచ్చింది. దాంతో ఆ మూడు కుక్కలు అక్కడ్నుంచి పరుగులు ప్రారంభించాయి. కుక్క బ్యాటరీతో పరుపుపై కూర్చోగా, ఆ పరుపుకు కూడా మంటలు అంటుకున్నాయి. కొంతసేపటికి మంటలు చెలరేగడంతో పరుపు మొత్తం కాలి బూడిదైంది. జరిగిన ప్రమాదంతో ఆ ఇంటికి ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై స్పష్టత లేదు. ఓక్లహోమా ఫైర్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ వీడియోను షేర్ చేసినట్లు చెప్పారు. ఈ బ్యాటరీలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని, ఈ బ్యాటరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచాలని ప్రజలను కోరుతున్నామని డిపార్ట్‌మెంట్ చెబుతోంది. మంటలు చెలరేగడంతో పెంపుడు జంతువులన్నీ ఇంట్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఆ కుటుంబాన్ని కూడా సురక్షితంగా బయటకు తీశారు.


bottom of page