లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం అనేది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. సినిమాల్లో కూడా వీటిని ష్యాషన్‌గా చూపిస్తున్నారు. ప్రేమికులు ఎక్కువగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే భార్యభర్తలు కూడా ముద్దుల ద్వారా వారి ప్రేమను తెలుపుతూ ఉంటారు. అయితే ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముద్దులు పెట్టుకోవడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవాశాలు ఉన్నాయి.
అలర్జీ సమస్యలతో బాధ పడేవారు లిప్ కిస్ పెట్టడం వల్ల ఇతరులకు కూడా వ్యాపించవచ్చు. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోకూడదు.
అలాగే ముద్దులు పెట్టుకోవడం వల్ల పళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. కొంతమంది అతిగా ముద్దులు పెట్టుకుంటారు. దీని వ్లల క్లామిడియా గొనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు.
అంతే కాకుండా ఒకరికి ఉన్న దీర్ఘకాలిక సమస్యలు మరొకరికి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా ముద్దులు పెట్టుకోవడం వల్ల న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతు్నారు.