top of page
MediaFx

మియా ఖలీఫా మూడు నెలల్లోనే టాప్‌ స్టార్‌ ఎలా అయింది?

1993 ఫిబ్రవరి 10న లెబనాన్‌లో పుట్టిన మియా ఖలీఫా వయసు 31 ఏళ్లు. 2014 అక్టోబర్‌లో అంటే దాదాపు పదేళ్ల క్రితం ఆమె పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే, పోర్న్‌లో నటించే సమయంలో ఆ విషయం జనానికి తెలియకూడదని అనుకుందట. తాను నటిస్తున్న ఫిలింస్ రహస్యంగా ఉంచాలనుకుందట.

అయితే కొద్దిరోజులకే విరక్తితో మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసిందట. ఇలా బయటకు వచ్చిన తర్వాత మియా ఖలీఫా అనేక ఇంటర్యూల్లో మాట్లాడింది. తాను చెప్పాలనుకున్నది ఓపెన్‌గా చెప్పింది. 

మియా ఖలీఫా అసలు పేరు సారా జో చమౌన్. లెబనాన్‌లోని బైరూట్‌లో జన్మించింది. ఆమె కుటుంబం 2001లో అమెరికా వెళ్లి స్థిరపడింది. మియా ఖలీఫా బాల్యం నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంది. లెబనాన్‌లో సివిల్ వార్ సమయంలో ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లి అక్కడే సెటిలయ్యింది. మియా టెక్సాస్‌లో పెరిగింది. అక్కడే స్కూల్‌లో చదివింది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఎల్ పాసో నుంచి హిస్టరీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసింది. 

2014లో పోర్న్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేనాటికి మియా ఖలీఫా వయసు 21 ఏళ్లు. జీవితంలో ఎదుర్కొన్న అనేక ఫెయిల్యూర్స్ కారణంగా కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభించింది. అలా ఎదగాలన్న అన్వేషణలో పోర్న్ ఇండస్ట్రీలోకి మియా అడుగుపెట్టింది. ఆమె మొదట్‌లో వైట్ వెబ్‌క్యామ్ మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత వివిధ పోర్నోగ్రఫీ ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి పనిచేసింది. 

2014 అక్టోబరులో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మియా ఖలీఫా 2015 ప్రారంభంలో బయటకు వచ్చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలున్నాయని ఆమె చెబుతుంది. అయితే, మూడు నెలలే పనిచేసినప్పటికీ ఆమె చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి. అతి తక్కువ కాలంలోనే అత్యధిక మంది చూసే పోర్న్ స్టార్‌ల జాబితాలో మియా ఖలీఫా చేరింది. తాను బయటకు వచ్చే నాటికి టాప్ పోర్న్ స్టార్లలో ఒకటిగా మారింది. 2014 డిసెంబర్ నాటికే పోర్న్‌హబ్‌లో నంబర్ వన్ పోర్న్ స్టార్ అయిపోయింది. 

ఇంత పాపులర్ అయిన మియా ఖలీఫా మిలియన్ల డాలర్లు సంపాదించి ఉంటుందని, కోట్ల కూడబెట్టి ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే ఆమె నటించే సమయంలో కేవలం 12 వేల డాలర్లు మాత్రమే పోర్నగ్రఫిక్ కంపెనీలు చెల్లించాయట.  ఆ తర్వాత వీడియోలకు బాగానే వ్యూవర్షిప్ ఉన్నా దాని నుంచి తనకు ఒక్క పైసా కూడా రాలేదట. తన పని వల్ల తనకు వచ్చినంత పేరుకు సమానంగా డబ్బు మాత్రం రాలేదంటుంది. 

ఇలా పోర్న్ స్టార్ పాపులర్ అయిన మియా ఖలీఫా.. పోర్న్ ఇండస్ట్రీ నుంచి బటయకు వచ్చాక ఆ ఇండస్ట్రీపైనే ఆరోపణలు చేసింది. అమాయకపు అడపిల్లలను అడల్ట్ కంటెంట్ తయారుచేసే కంపెనీలు వలలో వేసుకుంటాయని చెప్పింది. 

మియా ఖలీఫాకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 26 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా... ఫేస్‌బుక్‌లో దాదాపు 4.3 మిలియన్ల మంది, ట్విటర్‌లో 5 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె పేరు మీద వందలాది ఫేక్, పేరడీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. ఏకంగా మియా ఖలీఫా పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా నడుస్తోంది. అయితే ఆ వెబ్‌సైట్‌కి తను ఓనర్ కాదు. దాన్నుంచి ఆమెకు ఎలాంటి లాభం రాదని చెబుతుంది. 

మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతుంది. వీడియోల ద్వారా ఫేమస్ అయినప్పటికీ పోర్న్ ఇండస్ట్రీలో తాను సంతోషంగా లేదట. అలాగే, తన జీవితం ఏమైపోతుందోననే ఆందోళన కలిగిందట. ఫ్యామిలీ, ఇంకా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఆమె కూడా పోర్న్ ప్రపంచం నుంచి బయటకు రావడానికి కారణాలయ్యాయి. 

మియా ఖలీఫా పోర్న్ జీవితంలో ఓ వీడియో అత్యంత వివాదమైంది. బురఖా ధరించి షూట్ చేసిన పోర్న్ వీడియో ఒకటి బయటకు రావడంతో ఆమెను చంపేస్తామని ఐసిస్ బెదిరించింది. ఒకానొక దశలో గూగుల్ మ్యాప్ ద్వారా తీసిన తన ఇంటి ఫొటోలను మియాకు పంపించి బెదిరించారు. దీంతో ఆమె హడలిపోయింది. దాదాపు రెండు వారాల వరకూ తను ఉన్న హోటల్ నుంచి బయటకు రాలేదు. 

పోర్న్ ప్రపంచం నుంచి బయటకు వచ్చిన తర్వాత మియా ఖలీఫా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆమె తన గతాన్ని స్వీకరించేందుకు చాలా ఏళ్లు పట్టిందని చెబుతుంది. పోర్న్ ఇండస్ట్రీని వదిలేసిన తర్వాత ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో అనేక సమస్యలు ఎదుర్కొందట. ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టమైందట. పోర్న్ స్టార్ కావడంతో కంపెనీలు ఆమెకు ఉద్యోగం ఇవ్వలేమని ఓపెన్ చెప్పేవట. ఆ సమయంలో ఎంతో బాధగా అనిపించిందని చాలా ఇంటర్వ్యూల్లో మియా ఖలీఫా చెప్పింది.

 అయితే, 2019లో మియా ఖలీఫాకి అమెరికన్ ప్రొఫెషనల్ చెఫ్ రాబర్డ్ సాండ్‌బర్గ్‌‌తో వివాహమైంది. వివిధ కారణాలతో ఏడాది తిరగకుండానే విడిపోయారు. అయితే, ఇది ఆమె రెండో వివాహం. ఖలీఫా తన హైస్కూల్ ప్రియుడిని 2011లో వివాహం చేసుకుంది. అతనితో 2014లోనే విడిపోయి.. 2016లో విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి బంధం తెగిపోయాక.. ప్యూర్టో రికన్ రాపర్ జాయ్కోతో 2022 వరకు రిలేషన్‌షిప్‌లో ఉంది.

bottom of page