top of page
MediaFx

విరాట్ కోహ్లీతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఊహించని ఆన్సర్ ఇచ్చిన గంభీర్..


విరాట్‌తో తనకున్న రిలేషన్‌షిప్‌పై గంభీర్ ఓపెన్‌ కామెంట్స్..

విరాట్ కోహ్లీతో తనకున్న రిలేషన్ షిప్ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. తమ మధ్య గొప్ప అనుబంధం ఉందంటూ చెప్పుకొచ్చాడు. విరాట్‌తో మెసేజ్‌ల ద్వారా మాట్లాడుతూనే ఉంటామని గంభీర్ పేర్కొన్నాడు. 140 కోట్ల మంది భారతీయులు గర్వించే అవకాశం వచ్చేలా టీమ్ ఇండియా బాగు కోసం మేమంతా చేయగలిగినదంతా చేస్తామని గంభీర్ తెలిపాడు.

వన్డేల్లో రోహిత్-విరాట్ భవిష్యత్తుపై..

వన్డే క్రికెట్‌లో రోహిత్-విరాట్ భవిష్యత్తుపై కూడా గంభీర్ చర్చించాడు. ప్రస్తుతం వీరిద్దరిలో క్రికెట్ చాలా మిగిలి ఉందని, ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా సిరీస్, ఆపై 2027 ODI ప్రపంచ కప్, ఇక్కడ రోహిత్-విరాట్ పాత్ర ముఖ్యమైనదంటూ తేల్చేశాడు. రవీంద్ర జడేజా గురించి ఏమన్నారు?

శ్రీలంక టూర్‌లో రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ముందు టెస్టు సిరీస్ ఉందని, అక్కడ అతని పాత్ర కీలకమంటూ చెప్పుకొచ్చాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో జడేజా తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపాడు.

bottom of page