మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ గుర్తింపు కార్డు లేకపోతే మన పనులు అవ్వడం చాలా కష్టం.ఆన్ లైన్‌లో ఆధార్ కార్డును చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి OTP అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా ఈ-ఆధార్ కార్డును ఈజీగా ఎలా డౌన్ లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...
* ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ నుంచి UIDAI అధికారిక వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీకు ఏ భాష కావాలో సెలెక్ట్ చేసుకోండి.
* లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో ‘‘My Aadhar ’’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత ‘‘Download Aadhar’’ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేస్తే ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
* అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఎంటర్ చేయండి.
* అనంతరం క్యాప్చా కోడ్‌తో సమర్పించాలి.
* ఆ తర్వాత ‘నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ చేయబడలేదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ప్రత్యామ్నాయ నెంబర్ లేదా ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వని నెంబర్ ఎంటర్ చేయండి.
* అప్పుడు ఆ ఫోన్ నెంబర్‌కి OTP వస్తుంది.
* ఆ ఓటిపిని ఎంటర్ చేసి, క్లిక్ చేస్తే చాలు ఆధార్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.