top of page
Shiva YT

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం..🔥🏚️

విజయవాడ శివారు ప్రాంతమైన కానూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్ స్టోరేజ్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.. రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గోడౌన్‌ను అనుమతి తీసుకుని నిర్వహిస్తున్నారా.. లేదా అన్నది క్లారిటీ లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత దట్టమైన పొగలు అలముకోవడంతో ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భయపడ్డారు.. కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.



bottom of page