భార్యాభర్తలన్నాక కలిసి ఒకే గదిలో పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు కౌగిలించుకోండి. ఇలా చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో రోజంతా హ్యాపీగా ఉంటారు.
నిద్రపోయినప్పుడు భాగస్వామిని కౌగిలించుకుంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. దీని కారణంగా శరీరం ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఇది భార్యాభర్తలకి ఆనందాన్ని ఇస్తుంది.
మీ పార్టనర్‌ని కౌగిలించుకుని పడుకుంటే, రాత్రంతా హాయిగా నిద్రపోతారు. దీంతో ఒత్తిడి, గందరగోళం తగ్గుతుంది. ఇద్దరి మనసు ఆనందంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం చాలా రీఫ్రెషింగ్‌గా ఉంటుంది.
ఇద్దరు కలిసి పడుకుంటే, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది మీ శరీరంలోని ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. మంటని కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
మీ రిలేషన్ బలంగా ఉండాలంటే మీకు, మీ భాగస్వామికి మధ్య కమ్యూనికేషన్ అవసరం. హగ్గింగ్ అనేది ప్రేమని వ్యక్తపరిచే బాడీ లాంగ్వేజ్. ఇలా రెగ్యులర్‌గా చేస్తే, ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.