top of page
MediaFx

హైదరాబాద్ అందాలను ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..


ఇంస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ స్పీడ్ పెంచింది. మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆతర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దాంతో ఒక్కసారిగా నభా నటేష్ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. రవితేజ సరసన నటించింది ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే డార్లింగ్ అనే సినిమాలోనూ నటిస్తుంది ఈ చిన్నది. వీటితో పాటు మరో సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేసిఅభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తాజాగా హైదరాబాద్ రోడ్ల పై చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ట్యాంక్ బండ్ , చార్మినార్ దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. 

bottom of page