ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం..🛣️
- Suresh D
- Jul 31, 2023
- 1 min read
ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్‌ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు అంబాటులో ఉంది.

ఔటర్ రింగ్ రోడ్డుపై తెంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్‌ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు అంబాటులో ఉంది. అయితే ఈ స్పీడ్‌ను ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌కు అధికారులు జారీ చేశారు. ఇటీవల ఓఆర్ఆర్ అధికారులు, పోలీసులతో మంత్రి కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత సోమవారం ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.🏎️🚗