top of page

ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. హైవేలపై చార్జింగ్ స్టేషన్లు..🔋🚗

Suresh D

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దీనిపై ఫోకస్ పెట్టింది. పెట్రోల్ బంకులు ఉన్నట్లుగానే చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి అధిక సమయం పడుతుండటం.. బయటకు వెళ్తే.. ఆకస్మాత్తుగా చార్జింగ్ అయిపోతే అక్కడే పెట్టుకునే అవకాశం లేకపోవడం. దీంతో వారు దూర ప్రయాణాలకు ఈ వాహనాలను వినియోగించడం లేదు. ఈ క్రమంలో పెట్రోల్ బంకులు ఉన్నట్లు ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే గానీ సమస్యకు పరిష్కారం రాదు. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దీనిపై ఫోకస్ పెట్టింది. పెట్రోల్ బంకులు ఉన్నట్లుగానే చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైవేలపై తన అల్ట్రా-హై స్పీడ్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

ఇప్పటి వరకూ 11 స్టేషన్లు..

హ్యూందాయ్ ఇప్పటి వరకూ మొత్తం పదకొండు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్క స్టేషన్లో మూడు ఛార్జింగ్ పాయింట్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహన దారుల ఆందోళనను తగ్గిస్తూ నగరంలో ప్రయాణంతో పాటు హైవేలపై ప్రయాణానికి అనువుగా మార్చింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే వాన్ ర్యూ మాట్లాడుతూ తమ సంస్థను తాము ఎల్లప్పుడూ కొత్త బెంచ్‌మార్క్‌లను రూపొందించడానికి, పరిశ్రమను ఉదాహరణగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ అనే మా గ్లోబల్ విజన్‌తో సమలేఖనం చేయబడిన హ్యుందాయ్ తన కస్టమర్ అవసరాలన్నింటినీ తీర్చడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. సంపూర్ణ ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కస్టమర్ ఈవీ యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగంగానే తమ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను 11 స్థానాలకు విస్తరించామని వివరించారు. 

ఎక్కడెక్కడ ఉన్నాయంటే..🔋🛣️

ఈ ఛార్జింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ముంబై, పూణే బెంగళూరు వంటి నగరాలు, అలాగే ఢిల్లీ-చండీగఢ్, ముంబై-సూరత్ వంటి ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్లలో కేవలం హ్యుందాయ్ వాహనాలకే కాక నాన్-హ్యుందాయ్ ఈవీ యజమానులకు కూడా రెండు గంటలపాటు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. ఆయా స్టేషన్ల వద్దే కాఫీ షాపుల వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జర్‌లు శీఘ్ర ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రత్యేకించి హ్యుందాయ్ ఐయనిక్5వంటి మోడళ్లకు ఇది కేవలం 21 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఛార్జింగ్ ధరలు సరసమైనవిగా ఉంటాయి. యూనిట్‌కు రూ.18 నుంచి ప్రారంభమవుతాయి. మైహ్యూందాయ్ యాప్ ద్వారా సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు. 🔋🛣️

 
bottom of page