టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.
వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో.. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నారు. గతంలో సాయిపల్లవి పై చేసిన ఇంట్రెస్టింగ్ కాంమెంట్స కారణంగా సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను యాంకర్.. మీరు ఎవరి నటిననైన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనకు సాయి పల్లవి నటన అంటే తనకు ఇష్టమని తెలిపాడు. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నటన తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి చనిపోయే సీన్ లో తన నటన చూసి కన్నీళ్లు వచ్చాయి అని తెలిపాడు.