top of page
MediaFx

ఈ అలవాట్లు ఉన్నాయంటే అమ్మాయిలు అస్సలు లవ్ చేయరు..


ప్రైవసీని లాక్కోవడం:

బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ.. ప్రతీ వ్యక్తికి.. వారికంటూ కొంచెం ప్రైవసీ ఉంటుంది. ప్రతి రోజూ తనతోనే మాట్లాడాలని, ఎక్కడికి వెళ్లినా ఆమె.. తన అనుమతి తీసుకోవాలనుకునే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అమ్మాయిలు అలాంటి అబ్బాయిలతో ప్రేమలో పడితే, కచ్చితంగా బందీగా ఉన్నానని.. స్వేచ్ఛను కోల్పోయానని భావించవచ్చు. ఈ లక్షణాలు మీలో ఉంటే.. వెంటనే మానుకోండి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తి:

ప్రతి అమ్మాయి తన భాగస్వామి తనతో ఆప్యాయంగా ఉండాలని కోరుకోవడం సహజం. అయితే చిన్న చిన్న విషయాలకు కూడా అరిచి దూషిస్తే.. అలాంటి వారిని ఎవరూ ఇష్టపడరు. కొన్ని సున్నితమైన ఆలోచనలను, విషయాలను ప్రేమతో చెప్పడం మంచిది. అరిచి లేదా కోప్పడి చెప్పడం వల్ల ఒక్కోసారి బంధం అనేది బలహీనపడుతుంది లేదా తెగిపోతుంది. అలాంటి గుణం తన భాగస్వామిలో లేదా అబ్బాయిలో ఉంటే, అతన్ని వీలైనంత దూరంగా ఉంచుతారు అమ్మాయిలు.

పదే పదే అనుమానించడం:

ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్ బిజీలో ఉంటే.. పదే పదే ఎవరితో మాట్లాడుతున్నావ్.. ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ అనుమానించి అడగడం ఏ అమ్మాయికి నచ్చదు. అయితే ఈ లక్షణం రిలేషన్ మొదట్లో అమ్మాయిలు.. అబ్బాయి లేదా తన భాగస్వామి పొసెసివ్‌నెస్‌గా భావిస్తుంటారు. కానీ క్రమంగా ఇది పెరిగితే.. వారికి మీ మీద ద్వేషం ఏర్పడుతుంది.

ఎక్స్ లవ్ గురించి పదేపదే అడిగే ధోరణి:

సహజంగా ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. కాబట్టి అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ లేదా భాగస్వామితో వ్యక్తిగత విషయాలను పంచుకుని ఉండవచ్చు. కానీ పదేపదే ఆమె ఎక్స్ లవ్‌ గురించి మాట్లాడే వ్యక్తిని ఒక అమ్మాయి అస్సలు ఇష్టపడదు. మొదట్లో సహించినా.. ఆ తర్వాత ద్వేషించడం ఖాయం.

bottom of page