top of page
MediaFx

కోహ్లి సెంచరీ చేస్తే.. మ్యాచ్ ఓడినట్లేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో 8వ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్ కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు.

ఈ అజేయ సెంచరీ సాయంతో ఆర్‌సీబీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 184 పరుగుల లక్ష్యఛేదనలో విజయం సాధించింది. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా వృథా అయింది.విశేషమేమిటంటే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 8 సెంచరీలు సాధించగా ఇందులో ఆర్సీబీ ఐదుసార్లు విజయం సాధించింది. కింగ్ కోహ్లి మూడు సెంచరీలు వృథాగా మారిపోయాయి. మరి కోహ్లి సెంచరీ ఎప్పుడు వృధా అయిందో ఇప్పుడు చూద్దాం..ఐపీఎల్ 2016: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లి మొత్తం 4 సెంచరీలు చేశాడు. కానీ, గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో RCB ఓడిపోయింది.ఐపీఎల్ 2023: ఐపీఎల్ చివరి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో 101 పరుగులు చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.ఐపీఎల్ 2024: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో మెరిశాడు. అయితే ఈ సెంచరీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడం విశేషం.

bottom of page