top of page
MediaFx

ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. డైరెక్టర్ నితిష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్ లీక్ కావడంతో రామాయణం పై ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్టులో కేవలం రాముడు, సీత గురించి మాత్రమే ఉంటుందని అంటున్నారు. ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నారు. అలాగే కన్నడ హీరో యష్ రావణుడిగా.. ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్ఫణఖగా రకుల్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఇందులో అరుణ్ గోవిల్ రాజా దశరథుడిగా.. లారా దత్తా కైకేయిగా.. సాక్షి తన్వర్ మండోదరిగా.. నవీన్ పొలిశెట్టి లక్ష్మణుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం.


bottom of page