top of page
Shiva YT

🇵🇰 ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష.. పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు 🇵🇰

🇵🇰 పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య బుష్రాబీబీలకు పాకిస్థాన్‌ కోర్టు శనివారం ఫిబ్రవరి 3న శిక్ష విధించింది. 🚨 ఇస్లామేతర వివాహం చేసుకున్న కేసులో ఇద్దరికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 🔒 రెండు వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం ఇద్దత్ పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. 📜 ఇమ్రాన్ ఖాన్ మొదటిభార్య ఖవార్ మనేకా కేసు పెట్టారు.

💔 పెళ్లికి ముందు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇమ్రాన్‌ మాజీ భార్య మేనక ఆరోపించింది. 🚫 ఇమ్రాన్ ఖాన్ బహుళ కేసుల కారణంగా సెప్టెంబర్ 2023 నుండి జైలులో ఉన్నారు. 🏛 రావల్పిండిలోని అడియాలా జైలులో 14 గంటల పాటు విచారణ తర్వాత ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. 🕵 అదనపు సాక్షులను హాజరుపరచాలన్న డిఫెన్స్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 🚫 ఇది కాకుండా, బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. 🤷 సీనియర్‌ సివిల్‌ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 📰 విచారణ సందర్భంగా, ఇమ్రాన్ ఖాన్, మేనకా మధ్య కోర్టులో తీవ్ర వాగ్వాదం జరిగింది. ⚖ కోర్టులోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబ జీవితాన్ని నాశనం చేశాడని, దాని కారణంగానే తన కూతురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మేనక కోర్టుకు తెలిపింది. 📣

📅 ఇటీవలె పలు కేసులో జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ కోర్టులు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ⚖ తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైల శిక్ష పడింది. 📆 అయితే ఫెయిత్‌ హీలర్‌గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్‌ వెళుతుండేవారు. 🔄 అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. 🤵 కాగా, ఈ విషయమై బుష్రా బీబీ మాట్లాడుతూ..తన పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని.. 🗣 తలవంచను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 🎙

bottom of page