తమిళ స్టార్ హీరో సూర్యకు షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. జిగర్‌తండా డబుల్ ఎక్స్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు, సూర్య కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘సూర్య 44’ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ అండమాన్‌లో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ను ఊటీలో జరుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో సూర్య తలకు గాయం అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రమాదం అయిన వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. డియర్ ఫ్యాన్స్ ఇది చిన్న గాయం. దయచేసి చింతించకండి, సూర్య ఇప్పుడు కోలుకున్నాడు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలతో బాగున్నాడు ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళం నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు, సూర్య నటించిన ‘కంగువ’ సినిమా అక్టోబరు 10న విడుదల కానుంది. దర్శకుడు శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.