top of page
Suresh D

🏆🇮🇳 ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. 🏏 ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం! 🥳

🏏 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్‌ ప్లేయర్లు లేకపోయినా.. 🇮🇳 ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. 🎉 మొహాలీ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 🏆 మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ను మహ్మద్ షమీ దెబ్బతీశాడు.

🏏 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్‌ ప్లేయర్లు లేకపోయినా.. 🇮🇳 ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. 🎉 మొహాలీ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 🏆 మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ను మహ్మద్ షమీ దెబ్బతీశాడు. 🏏 తన కెరీర్‌లో అత్యుత్తమంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 276 పరుగులకు ఆలౌట్ చేశాడు. 🙌 అనంతరం లక్ష్య ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ (74) మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 🌟 అతనితో పాటు మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(71), స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (58 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (50) సమష్ఠిగా రాణించడంతో 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది భారత్. ఈ విజయంలో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. 🎉 అలాగే వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కూడా నంబర్ 1 ర్యాంక్‌కు చేరుకుంది. 🥇 ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలోనూ భారత జట్టే అగ్రస్థానంలో ఉండడం విశేషం. కాగా 2023 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా కూడా కీలక ఆటగాళ్లు లేకుండానే మొహాలీ వన్డేలో బరిలోకి దిగింది. 🇦🇺 అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయ్యింది. కాగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 27 ఏళ్ల తర్వాత భారత్ విజయం సాధించడం గమనార్హం. 🏏🏆


bottom of page