top of page
Suresh D

కన్న పిల్లల్ని, భార్యను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ అమెరికన్👨‍👩‍👦‍👦🔫

మెటా లో గతంలో ఇంజనీర్ గా పని చేసిన, భారత్ కు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (37) తన భార్య అలీజ్ బెంజిగర్ (38)ను, నాలుగేళ్ల కవల కుమారులు నోవా, నీథాన్ లను కాల్చి చంపాడు.

కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలో 2.1 మిలియన్ డాలర్ల విలువైన ఇంట్లో నలుగురు సభ్యులున్న కుటుంబం సోమవారం విగత జీవులుగా కనిపిచ్చారు. ఆ ఇంట్లో పోలీసులు భారతీయ అమెరికన్ దంపతులు, వారి కవల పిల్లల మృతదేహాలను గుర్తించారు. వీరిని ఆనంద్ సుజిత్ హెన్రీ (37), అలీజ్ బెంజిగర్ (38), వారి నాలుగేళ్ల కవల కుమారులు నోవా, నీథాన్ గా కుటుంబ స్నేహితులు గుర్తించారు.ఓ బాత్ రూమ్ లో బుల్లెట్ గాయాలతో దంపతులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వారి పక్కనే 9 ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ లభ్యమయ్యాయి. వారి పిల్లలు ఒక బెడ్ రూమ్ లో సోఫాలో శవమై కనిపించారు. హెన్రీ తన భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

హెన్రీ గూగుల్ మరియు మెటాలో మాజీ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మేనేజర్ అని రికార్డులు చూపిస్తున్నాయి. అతని భార్య బెంజిగర్ డేటా సైన్స్ మేనేజర్. వారిద్దరు 2016లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వారికి ఇంకా విడాకులు రాలేదు. భారత్ కు చెందిన ఈ జంట 2020లో కాలిఫోర్నియాలోని తమ మల్టీ మిలియన్ డాలర్ల ఇంట్లో స్థిరపడ్డారు.

పిల్లలను తుపాకీతో కాల్చి చంపడం కాకుండా, వేరే పద్ధతిలో చంపారని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వర్గాలు తెలిపాయి. వారి శరీరంపై గాయం ఆనవాళ్లు లేనందున వారిని ఊపిరాడకుండా చేయడం, గొంతు నులిమి చంపడం లేదా ప్రాణాంతక ఔషధం అధిక మోతాదులో ఇవ్వడం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

క్రైమ్ సీన్, ఇన్వెస్టిగేషన్ గురించి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ షాకింగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని శాన్ మాటియో పోలీస్ డిపార్ట్ మెంట్ ధృవీకరించింది. ‘అధికారులు ఇంట్లోకి ప్రవేశించి నలుగురు చనిపోయినట్లు గుర్తించారు. 1 వయోజన పురుషుడు, 1 వయోజన స్త్రీ, మరియు ఇద్దరు పిల్లలు. దురదృష్టవశాత్తూ ఇద్దరు చిన్నారులు పడకగదిలో శవమై కనిపించారు. వారి మరణానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు.👨‍👩‍👦‍👦🔫

bottom of page