top of page
Suresh D

🇮🇳 భారత కమ్యూనిస్టు ఉద్యమం - ఫీనిక్స్ ఉద్యమం 🌅

హోమ్ రూల్' పేరుతో కాంగ్రెస్ నాయకులపైన ప్రజల ఒత్తిడి పెరిగింది. తర్వాత అనేక సంవత్సరాలకు కాంగ్రెస్ కూడా సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపు ఇచ్చింది. కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు తమ హక్కులకోసం పోరాడేందుకు స్వతంత్ర ప్రజా సంఘాలను నిర్మించి ప్రశ్నించే హక్కు ఉద్యమాలను నిర్మించి సాధించేందుకు, మార్గదర్శకత్వం సహించింది.

నేను ఇక్కడ చరిత్ర రాయడం లేదు. భారత దేశంలో కమ్యూనిస్టు వామపక్ష ఉద్యమం ప్రభావం, దాని ఫలితాలు గురించి క్లుప్తంగా తెలియజేయ దలుచుకునాన్ను 

భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుపు ఇచ్చిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ 

హోమ్ రూల్' పేరుతో కాంగ్రెస్ నాయకులపైన ప్రజల ఒత్తిడి పెరిగింది. తర్వాత అనేక సంవత్సరాలకు కాంగ్రెస్ కూడా సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపు ఇచ్చింది. కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు తమ హక్కులకోసం పోరాడేందుకు స్వతంత్ర ప్రజా సంఘాలను నిర్మించి ప్రశ్నించే హక్కు ఉద్యమాలను నిర్మించి సాధించేందుకు, మార్గదర్శకత్వం సహించింది.మార్క్సిజం-లెనినిజం సిద్దాంతం ప్రాతిపదికన అక్టోబరు మహావిప్లవ స్ఫూర్తితో ఏర్పడిన భారత కమ్యూనిస్టుపార్టీ, కొద్ది డజన్ల యువ విప్లవ యువకులతో ప్రారంభమై కుట్ర కేసులతో జైళ్ళపాలై, కొన్ని వందలమందికి విస్తరించింది. వేలు, లక్షల సంఖ్యలోనే పెరిగి భారతవేశంలో ఒక ప్రధాన రాజకీయపా ఫ్రీగా, ఉద్యమాల, త్యాగాల పార్టీగా మారింది. కేరళలోని పొన్న వయబార్ పోరాటాన్ని నడిపింది. అత్యంత నిరంకుశ, ఫ్యూడల్ సంస్థానంగా ఉన్న నైజాం సంస్థాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది. 4,600 మంది పైగా కమ్యూనిస్టులు తమ రక్తంతో, తమ కుటుంబాల కన్నీళ్ళతో తెలంగాణ గడ్డను

తడిపి, ఫ్యూడలిజం నుండి విముక్తి చేసింది. సుప్రసిద్ధ జర్నలిస్టు, ప్రఫుల్ విద్వాయి 'ది ఫీనిక్స్ మూమెంట్ పేర భారత కమ్యూనిస్టు వాముపక్ష ఉద్యమంపైన ఒక విమర్శ నాత్మకమైన పుస్తకం రాశారు. ఆయన అనేక గ్రుథాల రదయిత, ఇందులో ప్రధానంగా రెండు వామపక్షాల గురించి రాస్తూ, అనేక నక్సలైటు పార్టీల గురించి, కమ్యూనిష్టేతర, సోషలిస్టు ఉద్యమం గురించి కూడా రేఖామాత్రంగా వివరిం చాదు. కమ్యూనిస్టుపార్టీల సుధీర్ఘ ప్రయాణంపై అనేక సాను కూల అంశాలతోపాటు అతి ఘాటైన విమర్శలు చేశారు. భారతదేశంలో ఇతర శ్రామిక వర్గాలు, మధ్యతరగతి సంఘ మిలిటెంట్ పోరాటాలతోపాటు సాహిత్య సాయన్న తిక కళా రంగాలలో తెచ్చిన అద్భుతమైన ప్రగతిశీల ప్రభావాన్ని, పదుల లక్షల ప్రజలపై వాటి శక్తిమంతమైన ప్రభావాన్ని వివరించారు. అనేక చారిత్రక తప్పిదాలవల్ల భారతదేశ చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా మారిజాన్ని అన్వయించడంలో స్వతంత్ర నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేకపోవడం వల్ల నష్టపోయారని నిర్ధాక్షిణ్యంగా విమర్శించారు.

ఫీనిక్స్ అంటే ఏమిటి?

ఈజిప్టు, గ్రీరు మైథాలజీ పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనే అండమైన రంగుల పక్షిని చంపినా, కాల్చి బూడిద చేసినా ఆ బూడిదలోంచి మళ్ళీ పునరుజ్జీవనం పొందుతున్నదని, భయ మెరుగని శక్తిమంతమైన పోరాడేజీవి అని నమ్ముతాము. ఇదొక ఆధారంలేని నమ్మిక కావచ్చు, మూఢ నమ్మకం కావచ్చు కానీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని దీనితో పోల్చడం అద్భుతమైన పోలిక. ఈ పోలిక చూడగానే నాకు కొన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీల పరిణామాలు గుర్తుకు వచ్చాయి. రష్యా, చైనాల తర్వాత ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఇండోనేసియా పార్టీ 10 లక్షలమంది కమ్యూనిస్టులను సైనికాధిపతి సుపోర్ట్తో ఒక రాత్రి నిర్దాక్షణ్యంగా హత్యచేస్తే పార్టీ ఇప్పుడు మళ్ళీ ఆవిర్భవించింది. మెకార్డియిజంను ఎదుర్కొన్ని అమెది కన్ కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందింది. వేలాదిమందీని చంపినాగానీ ఇరాక్ పార్టీ పెరిగింది. కమ్యూనిస్టుపార్టీలు అసాధారణమైన వర్గపోరాటాల పార్టీ, గత 15 సంవత్సరాలుగా -ధక్కా ముక్కలు, నిమ్నోన్నతాలను చూసింది. పదుల, వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు జైళ్బలో నిర్భంధించబడ్డారు. హింసకు గురయ్యారు. ఈ ఉద్యమాల వల్ల వేలాదిమంది అమరులయ్యారు. తప్పుడు కేసులకు గురి అయ్యారు. కుటుంబాల నుండి దూరమయ్యారు. 


బ్రిటీష్ సామ్రాజ్యవాదంచేత, ఆ తర్వాత స్వాతంత్య్ర్యానంతరం పెట్టుబడిదారీ, మతోన్మాద రాజకీయపార్టీల క్రూర నిర్బంధానికి గురయ్యారు. కానీ, ఒక రాజకీయకక్షిగా నిలదొక్కుకున్నారు. తప్పులు సరిజేసుకుని ఐక్య ఉద్యమాలు నిర్మించారు. ఓటమి నుండి కష్టాల నుండి మళ్ళీ అరుణ పతాకం సగర్వంగా ఎగి

రింది. 1990 వ దశకంలో సోవియట్ యూనియన్, సోష బిస్టు దేశాల క్యాంపు పతనమైన తర్వాత ప్రపంచంలో అనేక దేశాలతో కమ్యూనిస్టుపార్టీలు అచేతనమయ్యాయి. అతివేగంగా విచ్ఛిన్నమయ్యాయి. పశ్చిమ యూరప్ దేశాలలో అత్యంత బలవత్తరమైన ఇటాలియన్, ఫ్రెంచ్ కమ్యూనిస్టుపా వీలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ఇటలీలో మూడవ వంతు ఓట్లు పొందిన ఇటాలియన్ కమ్యూనిస్టుపా దీని రద్దు చేసుకుని పార్టీ ఆఫ్ ద లెఫ్ట్ ' పేరుతో రూపాంతరం చెందినా ప్రభావం చూపలేదు. మళ్లీ పునరుజ్జీవనం చెందిన Ô జనరేషన్ కమ్యూనిస్టుపార్టీ ప్రారంభమై చీలికకు సరైన గుర్తింపు కలిగిన పార్టీగా పోరాటాలు నడుపుతోంది. సోవి యట్ పఠనానంతరం, ప్రపంచంలో అనేక కమ్యూనిస్టుఫా ర్జీలు తీవ్రంగా నష్టపోతే భారకదేశంలో ప్రధాన స్రవంతి కమ్యూనిస్టుపార్టీలు దుష్ప్రభావాన్ని తట్టుకుని నిలదొక్కుకోన డమేకాక మరిన్ని ఉద్యమాలు, పోరాటాలు నడిపిందని పార్టీ సభ్యత్వాన్ని గణనీయంగా పెంచుకుందని ప్రజా సంఘాలను బలవత్తర సంఘాలుగా మార్చి మిలిటెంట్ ఉద్యమాలను నదిపిందని 'ఫీనిక్స్ మూమెంట్ రచయిత ప్రఫుల్ బిద్వాయి వివరించారు. పశ్చిమ బెంగాలు, త్రిపుర, కేరళ రాష్ట్రాలలో బూర్జునా ఎన్నికలలో గెలిచి సుదీర్ఘకాలం పరపాలన సాగించడం గురించి వివరిం వారు. ఈ రాష్ట్రాలలో శ్రమజీవుల, వ్యవసాయ కూలీలకు అనుకూలంగా చట్టాలు చేసి కమ్యూనిస్టు ప్రత్యామ్నాయాన్ని రుజువు చేశారు. భారత రాజకీయ అజెండాను మార్చడంలో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, బొగ్గు గనుల జాతీయీకరణను, మహాత్మాగాంధీ గ్రామీణ పథకాన్ని సమాచార హక్కు చట్టాన్ని సాధించారు.

 2004లో 63 మంది కమ్యూనిస్టుపార్టీ పార్లమెంటు సభ్యులు మతోన్మాద రాజకీయపార్టీ అధికారంలోకి రాకుండా యు.పి.ఎ. ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇచ్చారు. బలమైన ప్రభుత్వరంగాన్ని దేశంలో ఏర్పాటు చేసేందుకు, కార్మిక శ్రేణులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రక, సామాజిక భద్రత సాధించారు. 1967లో ప్రపంచంలో మొదటిసారి బూర్జువా ఎన్నికలలో కేరళలో గెలిచి రికార్డు సృష్టించిన నాటి నుండీ నేటి వరకూ శక్తివంతమైన పాత్ర నిర్వహించేందుకు యావచ్ఛక్తితో కృషి చేస్తూనే

ఉన్నాయి .

 భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కమ్యూ విస్టుపార్టీ ప్రాతినిధ్యం ఉండేది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారి జాతీయ గుర్తింపును సిసిఐ కోల్పోయింది. ఇది కేవలం సాంకేతికమైన విషయం మాత్రమే. ఆరు లక్షల యాభై భై వేల సభ్యత్వంతో అండమాన్, నికోబార్, లక్ష్వద్వీపాలతో సహా కమ్యూనిస్టుపార్టీకి వేలాది శాఖలు ఉన్నాయి. దాదాపు మూడు కోట్లమంది కమ్యూనిస్టులు పనిచేస్తున్నది ప్రజా సంఘాలు ఉన్నాయి. వారు అందరూ కమ్యూనిస్టులు కాదు, అవి స్వతంత్ర ప్రజా సంఘాలు వారి సమస్యలతోపాటు జాతీయ సమస్యలు, ప్రభుత్వ రంగ 1 పరిరక్షణ ధరల సమస్య లపై కూడా ఈ ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి. మరింత రాజకీయ చైతన్యం పెంపొందించాల్సి ఉంది. "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన

చూడండి" అని చెప్పేందుకు ఇది రాయడం లేదు. మన రాజకీయ శక్తి సన్నగిల్లినమాట నిజమే. కానీ కమ్యూనిస్టు, వామపక్షాలు, రాజకీయ ప్రభావం ప్రగతిశీల ప్రజలమీద, మేధావుల మీద ఈనాటికీ పెద్దది. గత అనేక దశాబ్దాలలో కమ్యూని స్థులు కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా మహత్తర పోరాటాలు నడిపారు. పెద్దసంఖ్యలో కులాంతర వివాహాలు నిర్వహించారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడి దేశంలో ఒక నూతన సామాజిక మార్పును సాధిం చారు, శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతం చేశాడు. అందుకే. కమ్యూనిస్టులను ఆర్ఎస్ఎస్, బిజెపిలు తీవ్రంగా ద్వేషిస్తు న్నాయి, కమ్యూనిస్టులను చూసి భయపడుతున్నాయి. ఈరో జుఫాసిస్టు కార్పొరేట్ అనుకూల మతోన్మాద పార్టీని మనదేశంలో ఎదుర్కోవాల్సిన చారిత్రక బాధ్యత కమ్యూనిస్టులమీద ఉంది. ఇది సాధ్యమా? సాధ్యమే.

తాత్కాలికంగా మత ప్రభావంతో ప్రజలలో గణనీయమైన భాగం బిజెపితో ఉండవచ్చు. కానీ ప్రజలతో మెజారిటీ ప్రజా స్వామ్య భావాలు గలవారు వారిని సమీకరించేందుకు కమ్యూనిస్టులు ఇరుసుగా విశాల ప్రజా ఐక్యత సాధించాలి. దేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్టు వామపక్షాల ఐక్యత, కనీసం ఒక్క కార్యాచరణ ప్రజలలో, ప్రతిపక్షాలలో విశ్వాసం కలిగి స్తుంది. కమ్యూనిష్టేతర సోషలిస్టు శక్తులు, కుటుంబ పార్టీ లుగా మారిన బీహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో శక్తి మంతమైన ప్రాంతీయపార్టీలుగా ఉన్నాయి. తమిళనాడులో మతోన్మాద. కులోన్మాద వ్యతిరేక పార్టీలు అధికారంలోనూ. ప్రతిపక్షంలోనూ ఉన్నాయి. బిజెపి వ్యతిరేక సెంట్రిస్ట్ పార్టీలు ఉన్నాయి. వీటన్నింటినీ సమైక్యం చేయాలి. సమావేశాల ద్వారా మాత్రమే ఈ ఐక్యత రాదు. ఉద్యమాలు, పోరాటాల

ద్వారా, ఐక్య కార్యాచరణ ద్వారా ఎంతపరిమితమైనదైనా సాధించాలి. దీనికి ముందు షరకు సూత్రబద్ధమైన కమ్యూ నిస్టు ఐక్యత, గతం తవ్వుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, ఐక్యకార్యాచరణకు పూనుకున్నాం. కమ్యూనిస్టులతోపాటు విప్లవపార్టీలు, మేధా వులు ఈ దిశగా ఆలోచించాలి. ఆ8 సంవత్సరాల గర్వకారణ మైన పోరాటాల చరిత్ర, అడుగడుగునా, రక్త తర్పణ చేస్తూ సాగుతున్న మన కమ్యూనిస్టుపార్టీలు ఈ అంశంపై వేగంగా స్పందించాలి. ఎర్రజెండాల ఐక్యత కోసం మార్క్సిజం బాటలో దోపిడీ డీ వ్యవస్థను నిర్మూలించేనైపుడు పార్టీ వార్షికో త్సవం సందర్భంగా ప్రతిన చేద్దాం. భారత కమ్యూనిస్టుపార్టీ వర్ధిల్లాలి, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, సెక్యులర్ ప్రజా తంత్ర అకృత వర్ధిల్లాలి.


bottom of page