top of page
Shiva YT

📈🌾 మార్కెట్‌లో భారత్‌ రైస్‌ రాయితీ ధరకే అమ్మకాలు షురూ.! 🚀🍚

కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. ఫిబ్రవరి 6 మంగళవారం సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్‌లోకి విడుదల చేసింది.

 ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో విక్రయాలను ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ బియ్యాన్ని కిలో 29 రూపాయలకి విక్రయిస్తారు. భారత్‌ రైస్‌ మంగళవారం నుంచి NAFED, NCCF, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్‌ రైస్‌ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. త్వరలో ఈ-కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. భారత్‌ ఆటాను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్‌లో కిలో 35 రూపాయలు ఉండగా, ప్రభుత్వం 27రూపాయల 50 పైసలకే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో 60 రూపాయలకి అందుబాటులోకి వచ్చాయి. 🌾💰

bottom of page