ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 3-1తో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 3-1తో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ సిరీస్‌ను కైవసం చేసింది. భారత్ ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం ఆసిస్ విఫలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఆసిస్ చేతిలో ఫైనల్ మ్యాచ్ ఓడి క్రికెట్ లవర్స్‌ను నిరాశ పరిచిన టీమిండియా.. వెంటనే టీ20 సిరీస్‌ను అదే జట్టుపై సొంతం చేసుకోవడం విశేషం.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికొస్తే.. మాథ్యువేడ్ అత్యధికంగా 36 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ 31 పరుగులు చేశాడు. ఇక మాథ్యు షార్ట్ 22 పరుగులు, బెన్ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. అక్సర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లనుపడగొట్టాడు. ఇక రవి భిషోని, అవీష్ ఖాన్ ఒక్కో వికెట్‌ను తీసుకున్నారు.
ఇక అంతకు ముందు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ టీమ్ ఇండియాకు శుభారంభం అందించిన, తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో రింకూ సింగ్, జితేష్ శర్మలు ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నారు. స్పిన్నర్ తన్వీర్ సంఘా ఆస్ట్రేలియన్ జట్టు తరపున చాలా సమర్థవంతంగా రాణించాడు. రింకూతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37, జితేష్ శర్మ 35, రీతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు చేశారు. బెన్ ద్వార్షస్ 3 వికెట్లు తీయగా, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా చెరో 2 వికెట్లు తీశారు.
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించి తొలి వికెట్‌కు 6 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో యశస్వి (37) కొనసాగాడు. దీంతో టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 8 పరుగులు చేసి తన్వీర్ సంఘా స్పిన్‌లో చిక్కుకోగా, బెన్ ద్వార్షియస్ బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్ తీశాడు. ఈ విధంగా 63 పరుగులకు చేరుకునే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.🏆🇮🇳