కల చెదిరింది.. ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ బోల్తా.. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా🏏🏆
- Suresh D
- Nov 20, 2023
- 1 min read
కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెదిరింది. స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్ మ్యాచ్‌లో బోల్తా పడింది. ఆదివారం (నవంబర్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెదిరింది. స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్ మ్యాచ్‌లో బోల్తా పడింది. ఆదివారం (నవంబర్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ట్రెవిస్ హెడ్ భారీ (120 బంతుల్లో 137) భారీ సెంచరీతో చెలరేగగా, మార్నస్ లబుషేన్ (58) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ అభేద్యమైన మూడో వికెట్ కు 194 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లతో బుమ్రా 2 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా, విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ(47) పరుగులతో రాణించారు. గిల్ (4), శ్రేయస్ అయ్యర్ (4), రవీంద్ర జడేజా (9), సూర్య కుమార్ యాదవ్ (18), మహ్మద్ షమీ (6), జస్ ప్రీత్ బుమ్రా (1), కుల్ దీప్ యాదవ్ (10), మహ్మద్ సిరాజ్ (9) నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3 కీలక వికెట్లు తీయగా, హాజెల్ వుడ్, కమిన్స్ తలా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ట్రెవిస్ హెడ్ నిలిచాడు.