ఆసియా కప్‌లో సూపర్-4లో కొలంబో వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 228 పరుగుల భారీ తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసింది భారత్.
ఆసియా కప్‌లో సూపర్-4లో కొలంబో వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 228 పరుగుల భారీ తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసింది భారత్.భారత్ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది.రిజర్వ్ డేలో టీమిండియా నిర్ణతీ 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 47వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. కేవలం 94 బంతుల్లో 122 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ తన కెరీర్‌లో ఆరో వన్డే సెంచరీని నమోదు చేశాడు. 106 బంతుల్లో 111 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.🇮🇳🏏