top of page
Suresh D

రెండు సూపర్‌ ఓవర్లు.. సూపర్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు..

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది.

బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జనవరి 17) ఆఫ్ఘనిస్థాన్‌ తో జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్‌ సేన క్లీన్ స్వీప్ చేసింది . ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 212 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం తొలి సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ కూడా 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ రెండోసారి టై అయింది. దీంతో మ్యాచ్ మరోసారి సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఐదు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌కు 12 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘనిస్థాన్ తొలి మూడు బంతుల్లో 1 పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

bottom of page