top of page
Suresh D

మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా - స‌ర్ఫ‌రాజ్‌, ధ్రువ్ జురేల్ ఎంట్రీ🏏🏆

ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య రాజ్ కోట్ వేదిక‌గా మూడో టెస్ట్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.🏏🏆

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేశారు. మూడో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేని కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌ని తీసుకోగా, వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌గా కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు మూడో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తుంది. అందువల్ల రాజ్‌కోట్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశముంది.🏏🏆

bottom of page