భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమిండియా గురువారం (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమిండియా గురువారం (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సిరీస్‌ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత ‘బర్త్‌డే బాయ్’ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ముఖ్యంగా ఐదు వికెట్లతో సౌతాఫ్రికా నడ్డి విరిచాడు కుల్దీప్. జడేజా కూడా రెండు వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35), కెప్టెన్ ఐడెన్ మర్కరమ్ (14 బంతుల్లో 25) మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. మెరుపు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌కు సూర్య కుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు సిరీస్‌లో భారీగా పరుగులు చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది పురస్కారం కూడా లభించింది.